CM Chandrababu: టంగుటూరి ప్రకాశం పంతులు సాహసం ఎన్నటికీ మరువలేం..
ABN , Publish Date - May 20 , 2025 | 09:35 AM
టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ‘ఆంధ్రకేసరి’గా కీర్తిప్రతిష్టలు పొందిన ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాతని సీఎం చంద్రబాబు చెప్పారు.
అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasam Panthulu) వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు.
‘ఆంధ్రకేసరి’గా కీర్తిప్రతిష్టలు పొందారు..
‘ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా వెలుగొంది ‘ఆంధ్రకేసరి’గా కీర్తిప్రతిష్ఠలు పొందిన ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటీష్ తుపాకీకి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం ఆదర్శవంతం. ఆయనకు మరొక్కమారు ఘన నివాళి ఘటిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Education Department: మోడల్ స్కూల్స్ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్
Kuppam: రేపు కుప్పం రానున్న చంద్రబాబు
APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై మార్గదర్శకాలు
Read Latest AP News And Telugu News