CM Chandrababu: ఆ విషయంలో ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషించింది
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:43 PM
CM Chandrababu: ప్రశాంత వాతావరణంలో పక్షపాత రహితంగా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సాఫీగా సాగడానికి ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషించిందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

అమరావతి: జాతీయ ఓటర్ల దినోత్సవం-2025ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఎన్నికల సంఘానిదే కీలక పాత్ర ..
‘‘75 ఏళ్లకు ముందు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన రోజు నేడు. నేడు నేషనల్ ఓటర్స్ డే. 7 దశాబ్దాలకు పైగా ఎన్నికల సంఘం ప్రశాంత వాతావరణంలో పక్షపాత రహితంగా ఎన్నికలు నిర్వహిస్తోంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సాఫీగా సాగడానికి ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఎన్నికల సంఘం నిర్వహించుకుంటుంది. ఈ సందర్బంగా అర్హత కలిగిన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా దేశభవిష్యత్తుకు మార్గదర్శకత్వం వహించాలి’’ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also Read:
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..