Share News

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

ABN , Publish Date - Sep 30 , 2025 | 09:34 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు.

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..
CM Chandrababu Naidu

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చించినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. సమారు 40 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థికవ్యవస్థను కేంద్రం అండతో పునరుద్ధరిస్తున్నామని అమిత్‌షాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. సీఎంతో పాటు భేటీకి కేంద్ర మంత్రుల రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని హాజరయ్యారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థికసాయం కోరారు. పూర్వోదయ నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం.. ప్రణాళికలు రూపొందించినట్లు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు తెలిపారు. అనంతరం సీఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన సీఐఐ సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ, ప్రాడెక్టు పర్ఫెక్షన్ లాంటి కీలకమైన లక్ష్యాలను పెట్టుకున్నామని వివరించారు. సమీకృత అభివృద్ధి అనేది ఇప్పుడు ఓ నినాదం.. పీ-4 ద్వారా సమీకృత అభివృద్ధి సాధ్యం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Sep 30 , 2025 | 09:34 PM