Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బ్యాంకర్ల సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:34 PM

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బ్యాంకర్ల సమావేశం.. కీలక అంశాలపై చర్చ
CM Chandrababu:

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) షెడ్యూల్‌ బిజీ బిజీగా ఉండనుంది. మధ్యాహ్నం12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ముందుగా ఎస్ఎల్‌బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఆర్టీజీపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.ఈరోజు సాయంత్రం7 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 229, 230వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది.


2024 అక్టోబరు 17 తేదీన 228వ ఎస్ఎల్‌బీసీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో అధికారులు ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్‌బీసీ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్షించనున్నారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైనా మాట్లాడనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్‌వర్క్ ,జిల్లాలకు సంబంధించిన డిజిటల్ అంశంపైనా చర్చించనున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు హాజరు కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Shri Shailam.. శ్రీశైలానికి మంత్రుల బృందం

Purandeswari : ఏపీ, ఢిల్లీ ఫలితాలకు సారూప్యత: పురందేశ్వరి

Minister Narayana : టిడ్కో సముదాయాల్లో ఆలయాల నిర్మాణం

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 10 , 2025 | 12:46 PM