Shri Shailam.. శ్రీశైలానికి మంత్రుల బృందం
ABN , Publish Date - Feb 10 , 2025 | 08:45 AM
శ్రీశైలంలో ఏపీ మంత్రుల బృందం సోమవారం పర్యటించనుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించనుంది. శ్రీశైలాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి.

కర్నూలు జిల్లా: మహాశివరాత్రి (Mahashivaratri) ఏర్పాట్లు పరిశీలించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రుల బృందం (State Ministers Group) పర్యటించనుంది.. ఆరుగురు మంత్రులు శ్రీశైలం (Shrishailam) వెళుతున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు రానున్నారు. కాగా శ్రీశైల మహాక్షేత్రం ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇటీవల కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి విద్యావతి ఆధ్వర్యంలో శ్రీశైలంలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించే విషయమై ప్రాథమిక సమీక్ష జరిపారు. విడతల వారీగా ఆధునిక వసతులు కల్పించేందుకు కన్సల్టెన్సీల ద్వారా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు.
ఈ వార్త కూడా చదవండి..
వైసీపీ నేతకు లిక్కర్ స్కామ్ చిక్కులు
23న చంద్రబాబు శ్రీశైలం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23న శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం పట్టువస్త్రాలు అందజేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నడూ లేని విధంగా సీఎం నేరుగా హాజరై స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తుండటం విశేషం. గతంలో ప్రభుత్వం తరుపున ఎవరైనా మంత్రులు వచ్చి పట్టువస్త్రాలు స్వామి వారికి సమర్పించేవారు. శ్రీశైలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు కూడా తగిన ఏర్పాట్లుకు సిద్ధమయ్యారు.
కాగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిచంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..
దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News