వైసీపీ నేతకు లిక్కర్ స్కామ్ చిక్కులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 07:53 AM
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చిక్కుల్లో పడ్డారు. అప్పట్లో ఎక్సైజ్ శాఖను ఆయన నిర్వహించారు. మద్యం సరఫరా, అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న అంశంపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఎక్కడ బుక్ అవుతానో అని భయంతో వణికిపోతున్నారు.
చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ ఉప ముఖ్యమంత్రి (Ex Deputy CM) నారాయణ స్వామి (Narayana Swamy) జగన్ (Jagan) పాలనలో ఓ వెలుగు వెలిగారు. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. జగన్ మెప్పుకోసం టీడీపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పట్లో ఎక్సైజ్ శాఖను ఆయన నిర్వహించారు. మద్యం సరఫరా, అమ్మకాల్లో భారీ అక్రమాలు (Liquor Scam) జరిగాయన్న అంశంపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరుపుతోంది. భారీగా దోపిడీ జరిగిందని గుర్తించిన ఎన్డీయే దీనిని తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసింది.
ఈ వార్త కూడా చదవండి..
పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..
ఈ క్రమంలో నారాయణస్వామి ఈ కేసులో ఎక్కడ బుక్ అవుతానో అని భయంతో వణికిపోతున్నారు. అడ్డగోలుగా జరిగిన మద్యం దోపిడీ కిక్ తేల్చే పనిలో దర్యాప్తు బృందం ఉంది. ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తామంటూనే ధరలు పెంచి, కమిషన్లు కొట్టేసి.. వారికే ఆర్డర్లు ఇచ్చింది. ఈ భాగోతాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టే పనిలో ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 10 , 2025 | 07:53 AM