Anagani Sathya Prasad: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:22 PM
Anagani Sathya Prasad: ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు.

అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగుల నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఇవాళ(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొని డైరీ ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెపారు.
ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయిస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేశారు: మంత్రి నారాయణ
నెల్లూరు: ఏపీలోని అన్ని పట్టణాలు, నగరాల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వం పార్కులను నిర్వీర్యం చేసిందని.. దీంతో పార్కుల్లో వ్యాయామ పరికరాలన్నీ మూలనపడ్డాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.వేల కోట్లు వెనక్కుపోయాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేశారని మండిపడ్డారు. డబ్బులన్నీ డైవర్టు చేసి ఏపీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఏపీలో 85 లక్షల టన్నుల చెత్తచెదారాలు పేరుకుపోయాయని అన్నారు. నగరంలో గతంలో రూ.1100 కోట్లతో మినరల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. రూ.125కోట్ల పనులు మిగిలిపోయాయని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం వాటిని కూడా పూర్తి చేయలేదన్నారు. త్వరలోనే ఆ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని మున్సిపాల్టీల్లో వాటికొచ్చే ఆదాయాలను అవే వినియోగించుకునేలా చూస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర
YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు
YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..
YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి
Read Latest AP News and Telugu News