YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:57 PM
గేట్ నెం. 1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సభాపతి, డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు. అలాగే ప్రతిపక్ష నేత కూడా వస్తారు. అయితే జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు.. అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుపట్టారు. గేట్ నెం. 2 నుంచి మంత్రులు వస్తారు. గేట్ నెం. 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలకు రావాలి. మరి జగన్..

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), పులివెందుల (Pulivendula) ఎమ్మెల్యే వైఎస్ జగన్ (MLA YS Jagan) ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరవుతున్నారు. అయితే సమావేశాలకు హాజరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు అందరికీ ప్రోటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచి లోపలకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ వార్త కూడా చదవండి..
జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి
గేట్ నెం. 1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సభాపతి, డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు. అలాగే ప్రతిపక్ష నేత కూడా వస్తారు. అయితే జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు.. అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుపట్టారు. గేట్ నెం. 2 నుంచి మంత్రులు వస్తారు. గేట్ నెం. 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలకు రావాలి. మరి జగన్ నడుచుకుంటూ లోపలకు వెళతారా.. నడుచుకుంటూ వెళ్లి సింపతి గేమ్ చేసేందుకే వస్తున్నారా.. అనే చర్చ కూడా జరుగుతోంది. తనను సాధారణ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నారని.. తానొక పార్టీ అధినేతనని, మాజీ సీఎంగా పని చేసిన వ్యక్తిని అనే సింపతి గేమ్ చేసే పరిస్థితి ఉందా.. లేదా.. సభాపతికి ఉన్న అధికారం ఉపయోగించి జగన్‌కు గేట్ నెం. 1 నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందా.. అనే చర్చ కూడా జరుగుతున్నట్లు సమాచారం.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి (YS Jagan) సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు (Assembly Meetings) వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ఏంటంటే.. వరుసగా 60 పనిదినాలు శాసనసభకు హాజరుకాకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దువుతుంది. ఏ సభ్యుడైనా 60 పనిదినాలు సభకు రాకపోతే అతనిపై వేటు వేసేందుకు అసెంబ్లీ స్పీకర్ (Speaker) సీరియస్ (Serious)గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. ఆయన కేవలం అటెండెంట్ కోసం మొక్కుబడిగా వెళతారా.. ఎందుకంటే ఒక రోజు వెళితే మల్లీ 60 రోజుల వరకు వెళ్లనవసరం లేదు. ఈ క్రమంలో ఒక రోజు వెళ్లి పబ్బం గడుకుని వచ్చేస్తారా.. లేదా ప్రజల కోసం సభలో మాట్లాడదామని నిర్ణయించుకున్నారా.. కొంతమంది ఏమంటున్నారంటే.. జగన్మోహన్ రెడ్డి భయపడ్డారని.. లేదు.. జగన్ మారారని మరికొంతమంది అంటున్నారు. అతనిలో ‘భయమా.. మార్పా’.. అయితే భయమేనని అంటున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలోని 101లో క్లాజ్ 4 ఏం చెబుతుందంటే.. ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకపోతే ఆ సభ్యుడిని డిస్‌క్వాలిఫై చేసే అధికారం సభాపతికు ఉంటుంది. స్పీకర్ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్‌కు పంపితే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అవుతుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 4లో ఉంది. ఇది జరుగుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..
ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News