Brahmotsavams: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 09:27 AM
శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆది దంపతులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

నంద్యాల: శ్రీశైలం (Srisailam)లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavams) వైభవం (Grand)గా జరుగుతున్నాయి. ఐదోవరోజు (5th Day) ఆదివారం ఉత్సవాల సందర్భంగా సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం తరఫున అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆది దంపతులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనంపై ఆశీనులై భక్తులతో పూజలందుకోనున్నారు. ఆదివారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఈ వార్త కూడా చదవండి..
కాగా శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. కాగా.. శనివారం ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి కె.పెంచల కిషోర్.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జె.శ్యామలరావు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం రాత్రి భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రావణవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రన్నాయుడు తిరుగులేని నాయకుడు: సీఎం చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News