AP GOVT: గోదావరి వాసులకు శుభవార్త.. 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన
ABN , Publish Date - Jun 23 , 2025 | 10:08 PM
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరీ హాజరుకానున్నారు.
అమరావతి: అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు (Akhanda Godavari Tourism Project) జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరీ హాజరుకానున్నారు. దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్‌ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి.. గోదావరికి నిత్యహారతి, ఎక్స్ పీరియన్స్ సెంటర్‌గా కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంకా, నిడదవోలు, ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకోనుంది.
ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. 2027 గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. తద్వారా 8వేల మందికి పైగా యువతకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధి దొరకనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.375 కోట్లతో ఏపీ టూరిజం అభివృద్ధి చెందనుంది. ఈ సందర్భంగా శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం
For More Andhrapradesh News and Telugu News