CM Chandrababu: ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:19 PM
ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదిగిందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు.
అమరావతి, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అద్బుతమైన రాజ్యాంగాన్ని బీఆర్ అంబేద్కర్ మనకు రూపొందించి ఇచ్చారని ఉద్ఘాటించారు. ఓ ఛాయ్ వాలాగా ఉన్న నరేంద్రమోదీ ... దేశానికి అత్యుత్తమ ప్రధాని కాగలిగారు అంటే అది మన రాజ్యాంగం గొప్పదనమని అభివర్ణించారు. ఇవాళ(ఆదివారం) గుంటూరు జిల్లాలో జరిగిన భారత రాజ్యాంగ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారతదేశం అన్నిరంగాల్లో నిపుణులను అందిస్తుందని వివరించారు.
2014లో 11వ స్థానంలో ఉన్న భారతదేశం క్రమంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదిగిందని నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో న్యాయవ్యవస్థ అత్యంత కీలక బాధ్యత వహిస్తోందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
తొలుత ప్రింట్ మీడియా ... ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా.. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. సొషల్ మీడియా ద్వారా కొంతమంది వ్యక్తి హననానికి పాల్పడటం దురదృష్టకరమని తెలిపారు. ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని ఉద్ఘాటించారు. హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగం లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
Read Latest AP News And Telugu News