CM Chandrababu: రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:07 AM
రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu), ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
భారత రాజ్యాంగ సూత్రాలు మార్గనిర్దేశం చేస్తాయి: సీఎం చంద్రబాబు
‘భారత పౌరులందరికీ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు, మనం భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును గుర్తుచేసుకుంటూ, ఇందులో పొందుపరిచిన విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలను, ముఖ్యంగా దాని ప్రధాన వాస్తుశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని గౌరవిస్తాం. వారి దార్శనిక నాయకత్వంలో, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో మన ప్రజాస్వామ్యానికి పునాది వేశారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్‌ను నిర్మించడానికి మనం కృషి చేస్తున్నప్పుడు, మన రాజ్యాంగ సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అంబేడ్కర్ సేవలు స్మరించుకుందాం: మంత్రి నారా లోకేశ్
‘రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. మన హక్కులకు పెద్దదిక్కుగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ రచనా కమిటీ సేవలు స్మరించుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం. రాజ్యాంగ దినోత్సవాన్నిఏపీ ప్రభుత్వం వినూత్నంగా జరుపుతోంది. రాజ్యాంగం విలువల గురించి చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. మా విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా సభను ఎలా నడిపిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. స్టూడెంట్ అసెంబ్లీ పూర్తి అయ్యాక విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బొమ్మలు, సులభమైన భాషలో రూపొందించిన బాలల భారత రాజ్యాంగం ఆవిష్కరిస్తాం’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
Read Latest AP News And Telugu News