CM Chandrababu: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:36 PM
ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) సూచించారు.1990లలో ఇంటర్నెట్ వల్ల ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్‌గా మారిందని ఉద్ఘాటించారు. ఐటీపై ఆలోచన చేస్తే చాలదు... దానికి ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పుకొచ్చారు. ఇప్పడు హైదరాబాద్ ప్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారిందని వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్‌లో ఇవాళ(సోమవారం) వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 1995 టెక్నాలజీ రివెల్యూషన్‌ను ఇండియా పొందిందని, దానిలో తన పాత్రా ఉందని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు.
ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని.. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని తెలిపారు. 1989లో కుప్పం నుంచి పోటీచేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్‌లో తాను ఎలక్ట్రానిక్ ఎక్సేంజ్ తెస్తానని చెప్పానని.. అయితే ఆ విషయంతో తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ సేవలన్నీ ఆగస్టు 15వ తేదీ నాటికి వాట్సాప్ చాట్ బోట్ ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జనవరి ఒకటోవ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. టాప్ ఏఐ యూసేజ్‌లో చైనా, యూఎస్, ఇండియా మాత్రమే ముందు ఉన్నాయని వివరించారు. టీసీఎస్ మనతో ముందు నుంచీ ట్రావెల్ చేస్తోందని.. ఇప్పుడు డేటాలింక్‌పై పనిచేస్తోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
ఐటీపై ఆలోచన చేస్తే చాలదు..
‘నిజానికి క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రమోట్ చేయాలనుకున్నాం. దీనిపై ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానించాలనుకున్నాం. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్‌ను అనౌన్స్ చేసింది. వెంటనే కామకోటి మా వద్దకు వచ్చి ఈ విషయం చెప్పారు. వెంటనే నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగా... వారు ఓకే చెప్పారు. ఎలా ముందుకెళ్లాలనీ అడిగాం. ఈ రంగంలో మరింతమంది ముందుకు రావాలి. ఎకో సిస్టంను టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ద్వాారా చేయగలిగాం. ఐటీపై ఆలోచన చేస్తే చాలదు. దానికి ఎకోసిస్టం క్రియేట్ చేయాలి. ఐటీని నేను 1983-84లోనే అప్లైడ్ చేశాను. లోకేష్ పుట్టిన సమయం అది. దానిలో భాగంగా నేను అమెరికా వెళ్లా. మైక్రోసాఫ్ట్‌తోపాటు అన్ని నగరాలు తిరిగి ప్రయత్నం చేశా. బ్రిటిష్ వాళ్లు మన కోహినూర్ డైమెండ్‌ను తీసుకుపోయినా.. ఇక్కడ ఇంగ్లీష్ వదిలి వెళ్లారు. నేను అమెరికా నుంచి తిరిగి రాగానే అనేక ఇంజనీరింగ్ కాలేజ్‌లు ప్రారంభించి ఐటీ ఎడ్యూకేషన్‌ను పెంచా. ఇప్పుడు హైదరాబాద్ ప్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారింది. మేము గర్వంగా చెబుతున్నాం మేము మీదేశానికి సేవ చేస్తున్నామంటూ అమెరికన్ కాన్సులెట్ జనరల్‌తో చెప్పారు. గతంలో ఎక్కువ బిల్లు వస్తుందని అమెరికాలో లోకేష్ ఉన్నప్పుడు ఫోన్ చేయలేకపోయా. దీంతో ఇతర దేశాల్లో పరిణామాలు చూసి సెల్‌ఫోన్ తేవాలని చెప్పా. అయితే అప్పట్లో పేదరికం గురించి మాట్లాడేవారు...సెల్‌ఫోన్ ఎలా అన్నారు. ఇప్పడు భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త జీవించగలుగుతున్నారు. అయితే వీరిద్దరూ సెల్ లేకుండా ఉండలేకపోతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబు చమత్కరించారు.
ఇవి కూడా చదవండి:
సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్
ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు
For More AP News and Telugu News