Pawan Kalyan wishes For Chiranjeevi: చిరంజీవి నా జీవితానికే స్ఫూర్తి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:36 PM
మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మెగా అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. శుక్రవారం మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మెగా అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 69వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మెగా అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. రేపు(శుక్రవారం) మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మెగా అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలని చెప్పుకొచ్చారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా ట్వీట్ చేశారు.
మెగాస్టార్ తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవమని... వెలకట్టలేని జీవిత పాఠమని ఉద్ఘాటించారు. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం తనకే కాదు తనలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
చిరంజీవి తన కీర్తికి పొంగిపోలేదని.. కు విమర్శలకు కుంగిపోనూ లేదని తెలిపారు. తన విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే తాను నేర్చుకున్నానని నొక్కిచెప్పారు. అన్నింటిని భరించే శక్తి ఆయన నైజమని.. అందుకే ఆయన 'విశ్వంభరుడు' అని కొనియాడారు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News