YSRCP: వైసీపీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత
ABN , Publish Date - Aug 14 , 2025 | 10:44 AM
రామచంద్రపురం జెడ్పీటీసీ మేర్నీడి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన స్వగ్రామం రామచంద్రపురం మండలం తోటపేట గ్రామం. 2021లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరుపున మేర్నీడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
కోనసీమ జిల్లా, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): రామచంద్రపురం జెడ్పీటీసీ మేర్నీడి వెంకటేశ్వరరావు (59) (Merneedi Venkateswara Rao) ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన స్వగ్రామం రామచంద్రపురం మండలం తోటపేట గ్రామం. 2021లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరుపున మేర్నీడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. మేర్నీడి వెంకటేశ్వరరావు మృతితో తోటపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మేర్నీడి వెంకటేశ్వరరావు మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. వైసీపీకి మేర్నీడి వెంకటేశ్వరరావు అందించిన సేవలను ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు. ఆయన భౌతికంగా లేరు కానీ సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. మేర్నీడి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా మృతిచెందడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది
జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి
For More AndhraPradesh News And Telugu News