Minister Manohar: ఆ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:17 AM
Minister Nadendla Manohar: రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు ఆస్పత్రిని మంత్రి మనోహర్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యసేవలపై ఆరా తీశారు.
ఏలూరు జిల్లా: ఏలూరు ఆస్పత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఇవాళ(గురువారం) మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై మంత్రి మనోహర్ మండిపడ్డారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు.
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను మంత్రి నిలదీశారు. నెల రోజుల్లో ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. సిబ్బంది కొరత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన.. మహిళ జుట్టు కత్తిరించి..
Nandyala: మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం
Crime News: గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...
Read Latest AP News and Telugu News