Share News

AP Government: పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Nov 28 , 2025 | 10:21 AM

పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఇంజనీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

AP Government: పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం
AP Government

కాకినాడ జిల్లా, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు ఇంజనీరింగ్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. గతంలో ఏఈలుగా పనిచేసిన పి. వంశీ అభిషేక్, కె.రత్నవల్లి, డీఈఈ ఎస్. భవానీ శంకర్, ఎంటీ హుస్సేన్, పబ్లిక్ హెల్త్ ఈఈ నరసింహరావులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


గత వైసీపీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం ద్వారా 55 పనులకు గానూ రూ. 7.73 కోట్లు మంజూరయ్యాయి. కాగా పలు వార్డుల్లో 28 పనులను చేపట్టారు. వీటిలో డ్రైన్లు, సీసీ రోడ్ల పనులు ఉన్నాయి. ఈ పనులను రూ.3.19 కోట్లతో పూర్తి చేయగా... నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే ఐదుగురు ఇంజనీరింగ్ అధికారులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో ఇంజనీరింగ్ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీసీ బస్సులో పొగలు.. ఏమైందంటే..

ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 10:39 AM