Srivaru Donation: శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం.. ఎంత ఖరీదంటే
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:21 AM
హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈరోజు (మంగళవారం) ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు.
తిరుమల, నవంబర్ 4: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం (Tirumala Temple) కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కొండకు తరలివస్తుంటారు. వెంకన్నను కనులారా వీక్షించి పునీతులవుతారు. ప్రతీరోజు కొన్ని వేల మంది ఆ గోవిందుడిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఎవరి స్తోమత బట్టి వారు స్వామికి విరాళాలు ఇస్తుంటారు. వజ్రాలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు, వస్తువులు.. లేదా పెద్ద మొత్తంలో నగదును విరాళంగా అందజేసి ఆ శ్రీవారిపై తమ భక్తిని చాటుకుంటారు. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కుటుంబంతో కలిసి శ్రీవారికి భారీ వెండి గంగాళాన్ని విరాళంగా సమర్పించారు.

హైదరాబాద్‌కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈరోజు (మంగళవారం) ఉదయం కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు ఆలయ అధికారులకు గంగాళాన్ని భక్తుడు తన కుటుంబసభ్యులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులుకు ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇవి కూడా చదవండి...
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన
Read Latest AP News And Telugu News