Share News

TTD Employee Fraud: టీటీడీలో ఉద్యోగి చేతివాటం..ఇంటి దొంగలపై టీటీడీ కొరడా...

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:33 AM

TTD Employee Fraud: శ్రీవారి భక్తులు పలువురు స్వామి మీద ఉన్న భక్తితో విరాళాలు ఇస్తుంటారు. అయితే కొంతమంది టీటీడీ ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. దీంతో టీటీడీ అప్రదిష్టల పాలు కావాల్సి వస్తోంది. స్వామివారి ఆస్తులు పక్కదారి పట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TTD Employee Fraud: టీటీడీలో ఉద్యోగి చేతివాటం..ఇంటి దొంగలపై టీటీడీ కొరడా...
TTD Employee Corruption

తిరుపతి: వేంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో కొంతమంది భక్తులు టీటీడీకి సంబంధించిన ట్రస్టులకు విరాళాలు భారీగా ఇస్తుంటారు. మరి కొందరు భక్తులు స్వామివారి హుండీల ద్వారా కానుకలను అందజేస్తారు. భక్తులు ఇస్తున్న కానుకలను టీటీడీలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో టీటీడీకి చెడ్డపేరు వస్తోంది. అయితే తాజాగా చెన్నైలో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. టీటీడీకి చెందిన ఆలయ పరకామణిలో జరిగిన చోరీ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.


ఏకంగా శ్రీవారి హుండీలోనే దొంగతనానికి సదరు ఉద్యోగి పాల్పడ్డాడు. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ సీనియర్ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం చూపించాడు. విదేశీ కరెన్సీ రూపంలో స్వామివారికి భక్తులు కానుకలు అందజేశారు. ఇందులో సదరు ఉద్యోగి భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ కరెన్సీ లెక్కపెడుతుండగా భారీగా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. కరెన్సీ లెక్కింపులో భారీగా తేడాలు ఉన్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు.


ఈ ఘటన బయటకు రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావుకు కమిటీ నివేదిక సమర్పించింది. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు కృష్ణకుమార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టీటీడీ ఈవో శ్యామలరావు జారీ చేశారు. ఇటీవల శ్రీవారి దర్శన బ్లాక్‌ టికెట్ల దందా గుట్టురట్టయిన విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఆస్తులను భద్రంగా ఉంచాలని శ్రీవారి భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

TTD: టీటీడీలో ఫేక్‌ ఆధార్‌లకు చెక్‌!

Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు

High Court: పోసానికి హైకోర్టులో ఉపశమనం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 11 , 2025 | 11:40 AM