Share News

CPI Narayana: ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలి..

ABN , Publish Date - May 04 , 2025 | 01:58 PM

టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు.

CPI Narayana: ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలి..
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తిరుపతి: నగరంలోని బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్‌ (Ambedkar Bhavan)లో ఆదివారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్షం పార్టీల సమావేశం (Akhilapaksha meeting) జరిగింది. ఉగ్రవాదాన్ని (Terrorism) పెంచి పోషిస్తూ, యుద్ధానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్‌ (Pakistan)కు గుణపాఠం తప్పదు అనే అంశంపై ఈ రౌండ్ టేబుల్ (Roundtable) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్సలిజం వ్యవస్థలో మార్పు కోసం ఏర్పడిందని, సిద్ధాంత పరమైందని, అంతే కానీ వారు దేశానికి శత్రువులు కాదని అన్నారు. టెర్రరిస్టులకు సిద్ధాంతం ఉండదని, అరాచకం సృష్టించడమే టెర్రరిజమని అన్నారు.

Also Read: రాసలీలల అధికారిపై చర్యలకు రంగం సిద్ధం..


టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి...

టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు. టెర్రరిజం అంతంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న వారితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. టెర్రరిజంపై పోరు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. నీళ్లను ఆపడం తగదన్నారు. కత్తికి కత్తి, పన్నుకు పన్ను అనేది కరెక్ట్ కాదని సవాలపై పేలాలను ఏరుకోవడం మంచిది కాదని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.


అమరావతి పనులను శుక్రవారం పునఃప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఊసెత్తకుండా, రాజధాని అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయకుండా, ఉత్తుత్తి హామీలు ప్రకటించి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట రాజధాని నిర్మాణానికి వేసిన పునాది రాయిని మోదీ గుర్తు చేసుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రత్యేక హోదా, అవసరమైన నిధులు, అభివృద్ధి పనుల మంజూరుపై ప్రకటనలు చేయించడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విఫలమయ్యారని విమర్శించారు.

రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకునే రూ.15,000 కోట్లలో 10 శాతానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొంటుందని, మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి రావడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా ప్రధాని పర్యటన ఒక షోగా ముగిసిందన్నారు. రాష్ట్రంలో పాలకులు మారారు తప్ప అవినీతి విధానాల్లో ఏమాత్రం తేడా లేదని నారాయణ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 01:58 PM