Fake Baba: నకిలీ దేశ గురువు మాయాజాలం
ABN , Publish Date - May 04 , 2025 | 10:36 AM
బాబాలు దేవుడు, పూజలపై విపరీతమైన నమ్మకం ఉన్నవారినే వారు టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. మెల్లగా వారి ముగ్గులో దింపుతారు. మీకు జీవితంలో ఇలా జరిగింది, అలా జరగబోతుందని మాయ మాటులు చెబుతారు. ఆ పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని.. లేకపోతే ఇంటికి అరిష్టమని చెబుతూ గట్టిగా నమ్మిస్తారు. దీంతో అమాయక ప్రజలు వారి మాయలో పడి మోసపోతుంటారు.

జనగామ జిల్లా: పాలకుర్తి మండలం, విస్నూర్ గ్రామ ప్రజల (Visnur village People) అమాయకత్వాన్ని, వారి మూఢనమ్మకాలను అసరాగా చేసుకుని అందినకాడికి దోచుకున్న నకిలీ దేశ గురువు (Fake spiritual guru) మాయాజాలం (scam) వెలుగులోకి వచ్చింది. దేశ గురువు పేరుతో నకిలీ గుర్రం బాబా లక్షల రూపాయలు వసూలు చేశాడు. అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేశాడు. మోసాన్ని గ్రహించిన గ్రామంలో యువకులు నకిలీ దేశ గురువును పట్టుకుని నిలదీశారు. అయితే వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాబా అనుచరులను పట్టుకుని గ్రామస్తులు బంధించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: తోపుదుర్తి కోసం రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు..
ఈ బాబాలు దేవుడు, పూజలపై విపరీతమైన నమ్మకం ఉన్నవారినే వారు టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. మెల్లగా వారి ముగ్గులో దింపుతారు. మీకు జీవితంలో ఇలా జరిగింది, అలా జరగబోతుందని మాయ మాటులు చెబుతారు. ఆ పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని.. లేకపోతే ఇంటికి అరిష్టమని చెబుతూ గట్టిగా నమ్మిస్తారు. నకిలీ బాబాల మాటలు నమ్మి అమాయక ప్రజలు మోసపోతుంటారు. ఎలాంటి పూజలు, పౌరోహిత్యం రాకపోయినా, తాము చేసే పూజల వల్ల మీ ఇంబ్లో లక్ష్మి తాండవం చేస్తుందని, అందుకు ఈ పూజ చేస్తే చాలు సకల కష్టాలు తీరుతాయని నకిలీ బాబాలు నమ్మిస్తారు. ఇటీవల తిరుపతిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. తాను చేసే పూజల ద్వారా అంత శుభం జరుగుతుందని నకిలీ బాబా చెప్పి రూ.51 లక్షల రూపాయలు చేసిన ఘటనల గత నెల ఏప్రిల్ 29 తిరుపతి జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..
For More AP News and Telugu News