Share News

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: ఉద్యోగి రాసలీలలపై అధికారుల విచారణ..

ABN , Publish Date - May 04 , 2025 | 01:19 PM

ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. రాసలీలల అధికారిపై విచారణ జరిపి.. ఆ నివేదిక ఎగ్జిక్యూటివ్ ఈడీ పద్మావతికి ఇచ్చారు. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నవారు.

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: ఉద్యోగి రాసలీలలపై అధికారుల విచారణ..

విజయవాడ: పర్యాటక శాఖ కీలక ఉద్యోగి (Tourism department employee) రాసలీలలపై (Alleged Misconduct) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) కథనం ప్రచురించింది. ఈ కథనంపై అధికారులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. అధికారులు హరిత బెరంపార్క్, విజయవాడ డివిజన్ కార్యాలయంలో సిసిటివి ఫుటేజ్‌నీ పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుగా గుర్తించారు. రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఎందుకు డివిజనల్ కార్యాలయం తెరిచారన్న దానిపై అధికారులు వివరాల సేకరిస్తున్నారు. విజయవాడ డివిజన్ కార్యాలయంలోని సెక్యూరిటీ సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తు నివేదికను అధికారులు ఎగ్జిక్యూటివ్ ఈడీ పద్మావతికి ఇచ్చారు. నివేదిక ఆధారంగా అకౌంటెంట్ వెంకటేశ్వర్లపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.


పూర్తి వివరాలు..

కాగా ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆయన. రోజూ రాత్రిపూట తన ద్విచక్రవా హనంపై ఓ మహిళను వెంటబెట్టుకుని కార్యాలయానికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేటు అభిముఖంగా, బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ దిగువన ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ కార్యాలయం, కమర్షియల్ విభాగాలు ఉన్నాయి. ఈ భవనం మల్టీప్లెక్స్ కావటంతో బయట పెద్దపెద్ద గేట్లు ఉంటాయి. సెక్యూరిటీ కూడా ఉంటుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. దీంతో ఆయన రోజూ రెచ్చిపోతున్నారు.

Also Read: తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)


రాత్రి సమయంలో ఓ మహిళను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వస్తుండటంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో సందరు ఉద్యోగి అడ్డంగా దొరికిపోయారు. రోజూ రాత్రి 7-8. గంటల మధ్యలో తన బైకుపై ఓ మహిళను తీసుకురావటం సీసీ కెమెరాల ద్వారా రికార్జెంది. బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు వచ్చి బైక్పై వెళ్లిన ఆధారాలను సీసీ పుటేజీ ద్వారా సేకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నకిలీ దేశ గురువు మాయాజాలం

తోపుదుర్తి కోసం రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు..

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 01:19 PM