Parakamani Theft Case: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. పరకామణి చోరీ నిందితుడు రవికుమార్
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:42 PM
టీటీడీ పరకామణి చోరీపై నిందితుడు రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద జీయ్యర్ మఠంలో గుమస్తాగా పని చేస్తూనే పలు వ్యాపారాలు చేశానని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం పరకామణిలో చోరీకి పాల్పడ్డానని తెలిపారు.
తిరుమల, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణి చోరీ కేసుపై (Parakamani Theft Case) నిందితుడు రవికుమార్ (Accused Ravikumar) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద జీయ్యర్ మఠంలో గుమస్తాగా పని చేస్తూనే.. పలు వ్యాపారాలు చేశానని ప్రస్తావించారు. రెండేళ్ల క్రిత్తం పరకామణిలో చోరికి పాల్పడ్డానని తెలిపారు. పరకామణిలో చోరీ చేయడాన్ని మహాపాపంగా భావించి.. తాను, తన కుటుంబం తమ ఆస్థిలో 90 శాతం వేంకటేశ్వరస్వామివారికి రాసి ఇచ్చామని వివరించారు. తాను ఎవరి ఒత్తిడిలకు తల్లోగలేదని చెప్పుకొచ్చారు. ఇవాళ(శనివారం) తిరుమల వేదికగా మీడియాతో మాట్లాడారు రవికుమార్.
తన ఆస్థిని, డబ్బులను కానీ తాను ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనను కొంతమంది బ్లాక్‌మెయిల్ చేశారని.. వారీపై కేసు కూడా పెట్టానని ప్రస్తావించారు. తాను కొన్ని శస్త్ర చికిత్సలు చేయించు కున్నానని.. కొంతమంది తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానం ఆదేశిస్తే.. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అయిన తాను సిద్ధమని చెప్పుకొచ్చారు. తాను, తన కుటుంబం తీవ్ర క్షోభ అనుభవిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News