Share News

Nandamuri Balakrishna: చదువుపై శ్రద్ధ ఉండేది కాదు.. అందుకే సినిమాల్లోకి..

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:46 AM

హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు.తనకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nandamuri Balakrishna: చదువుపై శ్రద్ధ ఉండేది కాదు.. అందుకే సినిమాల్లోకి..
Nandamuri Balakrishna

శ్రీ సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం కిరికెర పంచాయితీ బసవన్నపల్లిలోని పాఠశాలలో రూ.64 లక్షల వ్యయంతో నిర్మించిన గదులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రారంభించారు. అనంతరం NREGS పథకం ద్వారా కోటి రూపాయల నిధులతో బసవన్నపల్లి నుంచి భరత్ నగర్ వరకు చేపట్టవలసిన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు. తనకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాగో అలాగా డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినీ రంగాల్లోకి అడుగు పెట్టానని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారు.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 11:48 AM