Minister Nara Lokesh: సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:12 AM
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు23(ఆంధ్రజ్యోతి): భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థం అని సత్యసాయి బోధించారని పేర్కొన్నారు.
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వమని సత్యసాయి చాటి చెప్పారని పేర్కొన్నారు. సత్యసాయి పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తానూ పుట్టడం పూర్వజన్మ సుకృతమని అభివర్ణించారు. సత్యసాయి విద్య, వైద్య, ప్రజావసరాలని తీరుస్తూ.. సేవాభావమే దైవత్వమని నిరూపించారని అన్నారు. సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాదిమంది భక్తులు పయనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజాసేవకు అంకితమైన కోట్లాదిమంది భక్తులు సత్యసాయి ప్రతిరూపాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
Read Latest AP News And Telugu News