Anantapur: అనంతపురం వాసులకు బిగ్ అలెర్ట్.. 10న ట్రాఫిక్ మళ్లింపు
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:37 PM
నగరంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
అనంతపురం: నగరంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్(SP Jagadeesh) ఒక ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం(Anantapur) నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు. కర్నూలు నుంచి తిరుపతి, చైన్నై వెళ్లే వాహనదారులు వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, బత్తలపల్లి, కదిరి, మదనపల్లె మార్గంలో వెళ్లాలని సూచించారు.
బళ్లారి నుంచీ బెంగళూరు వెళ్లే వాహనదారులు చెళ్లికెర, తుంకూరు, నెలమంగళ, బెంగళూరు(Bengaluru) మార్గంలో ప్రయాణించాలని సూచించారు. బెంగళూరు నుంచీ హైదరాబాద్ వెళ్లే వాహనదారులు బత్తలపల్లి, నార్పల క్రాస్, నాయనపల్లి క్రాస్, బుక్కరాయసముద్రం, వడియంపేట, నేషనల్ హైవే 44 రహదారిలోకి చేరి ప్రయాణించాలన్నారు.

తిరుపతి, చెన్నై నుంచి కర్నూలు వెళ్లాలనుకునే వాహనదారులు కదిరి, బత్తలపల్లి, నార్పల క్రాస్, నాయనపల్లి క్రాస్ మీదుగా బుక్కరాయసముద్రం వచ్చి వడయంపేట మీదుగా నేషనల్ హైవే 44 చేరుకుని కర్నూలు(Kurnool) వెళ్లాలని సూచించారు. బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే వాహనాలు సైతం అనంతపురం రాకుండా నెలమంగళ, తుంకూరు, చెళ్లికెర మార్గంలో వెళ్లాలని ఎస్పీ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News