Share News

V. Hanumantha Rao: కేంద్రం ఓబీసీల రిజర్వేషన్ పెంచాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:59 PM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రలో రైతులు, పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ. వి హనుమంతరావు (V. Hanumanthao) తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు.

V. Hanumantha Rao: కేంద్రం ఓబీసీల రిజర్వేషన్ పెంచాలి

ఢిల్లీ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రలో రైతులు, పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ. వి హనుమంతరావు (V. Hanumanthao) తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే మన జీవితాలు బాగుంటాయని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ డెడ్ లైన్ తీసేసి, రిజర్వేషన్ పెంచుతామని రాహుల్ చెప్పారని అన్నారు.

ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని తెలిపారు. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తారని తెలిసింది. తెలంగాణలోని బీసీలకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పర్యటించే ముందు బీసీలకు రిజర్వేషన్లపై సరైన హామీ ఇవ్వాలని కోరారు. గతంలో ప్రధానిని తాను కలిసిన సమయంలో బీసీలకు రిజర్వేషన్లు గురించి మాట్లాడితే ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్ పెంచాలని హనుమంతరావు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

CM Revanth: ఇల్లాలి ముఖంలో సంతోషం చూసేందుకే ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’...

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 04:59 PM