Share News

Thummala: ఆ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలది తప్పడు ప్రచారమే..

ABN , Publish Date - Mar 29 , 2024 | 10:31 PM

మాజీమంత్రి కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ లీలలు ప్రజలు చూశారని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో జరిగిన సభ కంటే.. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న సభ పెద్ద ఎత్తులో విజయవంతమవుతుందని అన్నారు.

Thummala: ఆ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలది తప్పడు ప్రచారమే..

హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ లీలలు ప్రజలు చూశారని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో జరిగిన సభ కంటే.. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న సభ పెద్ద ఎత్తులో విజయవంతమవుతుందని అన్నారు. తమ ప్రభుత్వ పాలనను దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు పొగుడుతున్నారని చెప్పారు.

TG Politics: బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ .. కిషన్‌రెడ్డి సెటైర్లు

తమ కమిట్మెంట్ గుర్తించకపోగా బీఆర్ఎస్ (BRS), బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేపో, ఎల్లుండో ప్రభుత్వ నివేదిక వస్తుందని.. నివేదిక రాగానే రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఎప్పుడూ ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై విమర్శలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఐదారు నెలల పాటు రైతుబంధు వేసిందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయిందని చెప్పారు. పంటల భీమా పథకంలో చేరుతామని స్పష్టం చేశారు. రైతులకు ఏ సమస్య వచ్చినా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ వెళ్లి పంటలను పరిశీలించినా తమకు, రైతులకు వచ్చేది పోయేదీ ఏం లేదన్నారు. కాళేశ్వరం గేట్లు ఎత్తమని చెబుతున్న హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

KTR: వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 10:35 PM