Share News

TG Elections: ఓటుకి నోటు కేసులో సీఎం రేవంత్‌పై రఘనందనరావు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:09 PM

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మరోసారి బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘనందనరావు (Raghanandana Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

TG Elections: ఓటుకి నోటు కేసులో సీఎం రేవంత్‌పై  రఘనందనరావు హాట్ కామెంట్స్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మరోసారి బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘనందనరావు (Raghanandana Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి సంబంధముందని .. ఈ కేసులో ఆయనకు శిక్షపడటం ఖాయమని అన్నారు. 2015లో ఓటుకి నోటు కేసు బయటకు వచ్చిందని.. మరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్‌‌రెడ్డిను కాపాడింది ఎవరు? అని ప్రశ్నించారు. రేవంత్‌ను ఈ కేసులో దేవుడు కూడా కాపాడలేరని అన్నారు.

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు


Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

కేసీఆర్‌, రేవంత్ కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయట్లేదన్నారు. కాంగ్రెస్‌కి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా కాంగ్రెస్ హామీలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి ఆ రోజే జాతీయ హోదా ఇవ్వాల్సిందని.. ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

ఒక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా ఇచ్చి... రెండో రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఏంటి? అని ప్రశ్నించారు. దుబ్బాకకు తాను ఏం చేశానో పుస్తకం తయారు చేసి.. ఆ నియోజకవర్గంలో 75వేల మందికి పంపిణీ చేస్తానని అన్నారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందనరావు మెదక్‌లో పనికి వస్తారా ? అని హరీష్ రావు, రేవంత్ మాట్లాడుతున్నారని చెప్పారు.


Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

కామారెడ్డిలో ఓడిపోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ఎలా చేపడతారు ? అని నిలదీశారు. 2018లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ క్యాబినేట్‌లో బీసీలు ఎంత మంది ఉన్నారు ? అని నిలదీశారు.

కాంగ్రెస్‌లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజధాని హైదరాబాద్‌కి దుబ్బాక ఎంత దూరమో.. కొడంగల్ కూడా అంతే దూరమని.. ఆ విషయం సీఎం రేవంత్ మర్చిపోవద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.


బీజేపీకి డబుల్ డిజిట్ వస్తే తెలంగాణలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో రేవంత్‌కి బాగా తెలుసునని హెచ్చరించారు. కేసీఆర్, రేవంత్ తెలంగాణకు హాని చేసే వ్యక్తులని మందలించారు. వెంకట్రామిరెడ్డి దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ తనకంటే ఎక్కువ చదువుకున్నోడు కాదని అన్నారు. కేసీఆర్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఆర్భాటం, ఆరంభం, అంతమని సెటైర్లు గుప్పించారు.


టీఆర్ఎస్‌ను.. బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారని.. ఆయన చేతిలోనే పార్టీ అంతమయ్యే అవకాశం ఉందని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పిదం వల్లే 10 ఏళ్లు బీఆర్ఎస్ బతికిందని గుర్తుచేశారు.

భస్మాసుర హస్తాన్ని ఆయన తలపై ఆయనే పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు 50 ఏళ్లని.. ఇప్పుడు 70 ఏళ్లు అని.. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుందని రఘునందన్‌రావు అన్నారు.


Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 06:25 PM