Share News

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

ABN , Publish Date - Apr 21 , 2024 | 12:58 PM

బీజేపీకి, జనసేన(BJP- Janasena) పార్టీకి మధ్య దూరం పెరిగిందా అంటే.. అవుననే అంటున్నారు జనసైనికులు.

Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

- సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో స్తబ్దుగా ఉన్న జనసేన నేతలు

హైదరాబాద్‌ సిటీ: బీజేపీకి, జనసేన(BJP- Janasena) పార్టీకి మధ్య దూరం పెరిగిందా అంటే.. అవుననే అంటున్నారు జనసైనికులు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌(Secunderabad Parliament) పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు, జనసేన నేతలు కలిసి ప్రచారం నిర్వహించగా, మే 13న జరగనున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో మాత్రం రెండు పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు ముందుకు వచ్చినప్పటికీ, కమలం పార్టీ నేతలు తగురీతిన ఆహ్వానం అందలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోనే తాము ఆ పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితులు ఏర్పడకపోవడంపై కొందరు జనసేన నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే విషయమై తమ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందకపోవడం వల్లనే జనసేన నేతలు స్తబ్దుగా ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: Secunderabad: ఆ ఎక్స్‌ప్రెస్‌ రైలు అంటేనే ప్రయాణికుల గుండెల్లో దడ.. విషయం ఏంటంటే..

2019లో జనసేన అభ్యర్థికి 10 వేల ఓట్లు!

గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి జనసేన పార్టీ సొంతంగా అభ్యర్థిని నిలిపింది. ప్రస్తుత ఆ పార్టీకి తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న ఎన్‌.శంకర్‌గౌడ్‌ గత ఎన్నికల బరిలో నిలవగా ఆయనకు 9,683ఓట్లు వచ్చాయి. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌(Secunderabad, Khairatabad, Jubilee Hills, Nampally, Sanatnagar, Mushirabad) ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి సెటిలైన వారు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ఓటర్లతో పాటు తెలంగాణలోనూ మెగా కుటుంబానికి, జనసేనానికి పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారని, గత ఎన్నికలతో పోల్చితే ఈ దఫా జనసేన పార్టీ మద్దతుదారుల సంఖ్య బాగా పెరిగిందని జనసేన నేతలు భావిస్తున్నారు. మొత్తంగా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 40 నుంచి 50వేల మంది జనసేనకు మద్దతు తెలిపే వారున్నట్టు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి జనసేన నేతలకు సరైన పిలుపులు లేకపోవడంతో జేఎ్‌సపీకి మద్ధతు తెలిపేవారంతా చీలిపోయి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు నెలకొన్న ముక్కోణపు పోటీలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతుదార్ల ఓట్లు ఎంతో అవసరమని, ఇప్పటికైనా తమను కలుపుకొని ముందుకు వెళ్లకుంటే గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని జనసేన పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు.

ఇదికూడా చదవండి: కేడీని దించేశాం.. ఇక మోదీనే!’

ఏపీ ఎన్నికలపై తెలంగాణ జన‘సేన’ ఫోకస్‌

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బీజేపీ, జనసేన నేతలను పట్టించుకోక పోవడంతో.. ఈ నియోజకవర్గం పరిధిలోని జేఎ్‌సపీ మద్ధతుదారులు ఏపీలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 20కిపైగా అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో జేఎస్‏పీ పోటీ చేస్తుండంతో.. ఆయా నియోజక వర్గాల్లో జనసేన అభ్యర్థుల గెలుపుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఏపీలో జనసేన గెలుపుకోసం తెలంగాణ ప్రాం తానికి చెందిన జనసైనికులు కూడా ఆసక్తిగా పనిచేస్తున్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో చావోరేవో అన్నట్టు ఎన్నికల వాతావరణం ఉండడంతో.. ప్రస్తుతానికి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం, ఏవేని పార్టీలకు మద్ధ తు ఇవ్వడం.. తదితర అంశాలపై జనసేన అధిష్టానం దృష్టి సారించేందుకు సమయం లేదని కొందరు జనసైనికులు అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నందున, ఒక పార్టీకి మద్ధతిస్తే వేరొక పార్టీకి టార్గె ట్‌ అయ్యే అవకాశం ఉన్నందునే జేఎస్‏పీ అధిష్టానం కూడా తెలంగాణలో పొత్తు అంశంపై జనసైనికులకు ఇప్పటిదాక డైరెక్షన్‌ ఇవ్వలేదని జేఎ్‌సపీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్‌ ఆటలు సాగనివ్వను...

Updated Date - Apr 21 , 2024 | 12:58 PM