Share News

TS BJP: కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్

ABN , Publish Date - Mar 09 , 2024 | 08:18 AM

కమలం పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. పెండింగ్‌ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను.. 9పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొసాగిస్తోంది.

TS BJP: కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్

హైదరాబాద్: కమలం పార్టీ తెలంగాణ (Telangana)లో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. పెండింగ్‌ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ (BJP) కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను.. 9పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొసాగిస్తోంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సిందిగా జలగం వెంకట్రావుకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది.

బీజేపీలోకి జలగం!

బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ‌ సీతారం నాయక్‌ను సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) బీజేపీలోకి ఆహ్వానించారు. మహబూబాబాద్‌ టికెట్‌ను సీతారాం నాయక్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ (Parliament) సీటును కళాకారుడు మిట్టపల్లి సురేందర్‌ (Mittapalli Surender)కు ఇచ్చే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే అరుణ (DK Aruna), జితేందర్ రెడ్డి, శాంతకుమార్ మధ్య పోటీ నెలకొంది. మెదక్ సీటు కోసం రఘునందనరావు, గోదావరి అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ సీటును రమేష్ రాథోడ్, సోలంకి శ్రీనివాస్, అభినవ్ సర్థార్ ఆశిస్తున్నారు. వరంగల్ సీటు కోసం కడియం కళ్యాణ్, చింతా సాంబమూర్తి పట్టుబడుతున్నారు. నల్లగొండ స్థానానికి బలమైన అభ్యర్థి కోసం బీజేపీ వేట ప్రారంభించింది.

బీఆర్‌ఎస్‌లోనే ఉంటా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 08:18 AM