Share News

బీఆర్‌ఎస్‌లోనే ఉంటా

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:49 AM

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది.

బీఆర్‌ఎస్‌లోనే ఉంటా

పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం

నా కుమారుడికి ఎంపీ టికెట్‌ వద్దు

అల్లుడి కాలేజీ కూల్చివేతపైనే

వేం నరేందర్‌రెడ్డిని కలిశా

కేటీఆర్‌తో సమావేశంలో

మాజీ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. మల్లారెడ్డిని పిలిపించుకుని మాట్లాడింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో శుక్రవారం కేటీఆర్‌తో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి సమావేశమయ్యారు. పార్టీ మార్పు అంశం, మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ కేటాయింపు, మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాల భవనం కూల్చివేతతో పాటు పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తిలేదని, కేసీఆర్‌ వెంటే నడుస్తానని మల్లారెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేయడమే కాక.. తన కుమారుడికి మల్కాజిగిరి ఎంపీ సీటు వద్దని, వేరే ఎవరికైనా ఇవ్వాలని కేటీఆర్‌తో మల్లారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతపై మాట్లాడేందుకే సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసినట్లు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి మల్కాజిగిరి టికెట్‌ ఇవ్వకపోయినా.. తన కుమారుడు బరిలో ఉంటారని మల్లారెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. అలాంటిది ప్రస్తుత నిర్ణయం వెనుక వేరే ఉద్దేశం ఉండి ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, మల్లారెడ్డి పార్టీ మారనని అధిష్ఠానానికి చెప్పినప్పటికీ.. దానిని నమ్మలేమని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Mar 09 , 2024 | 02:49 AM