Share News

TG News: యాదగిరిగుట్టలో పీటల వివాదంపై అధికారుల అలర్ట్

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:17 AM

Telangana: యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని ఆ ఘటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదంపై అధికారుల అలెర్ట్ అయ్యారు.

TG News: యాదగిరిగుట్టలో పీటల వివాదంపై అధికారుల అలర్ట్

యాదాద్రి, మార్చి 14: యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) చిన్న పీటలు వేసి అవమానించారంటూ వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదంపై అధికారుల అలెర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలకు పీటల వివాదం ఓ ఆయుధంగా కూడా మారింది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారుల అప్రమత్తమయ్యారు. వెంటనే పది సమాంతర పీఠలను ఆలయ సిబ్బంది కొనుగోలు చేసింది. పాతవి 4, కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి...

Hyderabad: ఎలా బతికేది.. ‘గాంధీ’లో మూడు నెలలుగా జీతాల్లేవ్‌..

Amit Shah: సీఏఏ అంశంపై మమత, స్టాలిన్, ఒవైసీలపై అమిత్ షా ఫైర్.. ఏ వర్గానికి భయపడేది లేదని వెల్లడి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 14 , 2024 | 11:29 AM