Share News

MP Laxman: ఆ సంస్థల నుంచి విద్యుత్ కొనేలా ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:51 PM

కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ‌ లేఖలు రాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.

MP Laxman: ఆ సంస్థల నుంచి విద్యుత్ కొనేలా ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్

హైదరాబాద్: కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనటానికి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్లాన్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ‌ లేఖలు రాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లు రావన్న ఉద్దేశంతోనే ఎన్టీపీసీ దగ్గర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయటం లేదన్నారు.

Barrelakka: మరో అనౌన్స్‌మెంట్ చేసిన ‘బర్రెలక్క’.. త్వరలోనే శుభకార్యం అంటూ..

ఎన్టీపీసీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ఎందుకు చేసుకోవటం లేదు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీపీసీ మూడు లేఖలు రాసిన ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే.. ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఎన్టీపీసీ లేఖల్లో తెలిపిందని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్.. ఇప్పడు ఏమి సమాధానం చెబుతోందని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.

TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 05:51 PM