Share News

Ponnam Prabhakar: ‘బిడ్డా సంజయ్.. నా తల్లిని తిడతావా’.. బండిపై పొన్నం ఫైర్

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:25 PM

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా కరీంగనర్‌ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ఎంపీ బండి సంజయ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్న రేంజ్‌లో ఒరిపై ఒకరు దమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి సరిగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బండి సంజయ్‌కు ఈటెల రాజేందర్‌కు విభేదాలున్నాయని అన్నారు.

Ponnam Prabhakar: ‘బిడ్డా సంజయ్.. నా తల్లిని తిడతావా’.. బండిపై పొన్నం ఫైర్
Ponnam Prabhakar Vs Bandi Sanjay

కరీంనగర్, ఏప్రిల్ 23: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు (Loksabha Elections) హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా కరీంగనర్‌ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Minister Ponnam Prabhakar), బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ (BJP MP Bandi Sanjay)మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్న రేంజ్‌లో ఒరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి సరిగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బండి సంజయ్‌కు ఈటెల రాజేందర్‌కు విభేదాలున్నాయని అన్నారు.

Hyderabad: ఆహా.. ఏం ఐడియా గురూ.. ఉల్లిపాయల బస్తాల మాటున నిషేధిత విత్తనాల రవాణా


అలాగే మురళీధర్ రావుతోనూ సంజయ్‌కు విభేదాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా నేతలను కూడా ఎంపీ దూరం పెట్టారన్నారు. ‘‘బిడ్డా బండి సంజయ్ నీకు చదువు రాదు.. భాష రాదు. నా తల్లిని తిడుతావా.. మహిళలను అవమానిస్తావా’’ అంటూ విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పదో తరగతి ఎక్కడ చదివారని ప్రశ్నించారు. తిరుపతికి కరీంనగర్ నుంచి అదనంగా రైలు నడిపావా అంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections: వైసీపీకి కొత్త కష్టాలు.. కుట్రలకు బలికాబోమంటున్న జనం..!


శ్రీధర్‌బాబు, జీవన్‌తో విభేదాలపై..

అలాగే.. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో విభేదాలపై పొన్నం స్పందించారు. ‘‘నాకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవు. నాతో ఎవరైనా విభేదాలు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. నా పార్లమెంట్ పరిధిలో అందరితోనూ బాగానే ఉన్నాను. పక్క పార్లమెంట్ నియోజకవర్గ నేతల గురించి నాకు తెలియదు. నన్ను గిచ్చితే నాకు తెలియడం లేదు. నా తోలు మందం అయ్యింది. వాళ్ళే గిచ్చి గిచ్చి ఊరుకుంటారు’’ అంటూ మంత్రి పొన్నం వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 01:18 PM