Share News

Ponnam: బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:59 AM

Telangana: అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్‌ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు.

Ponnam: బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే..

సిద్దిపేట, ఫిబ్రవరి 27: అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay), మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam Prabhakar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్‌ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా ఏం చేశావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నట్లు తెలిపారు.

తల్లిత ఎవరికేనా తల్లే...

‘‘ రాముడి జన్మంపై నేన్నడూ మాట్లాడ లేదు. నేనని మాటను నాకు ఆపాదిస్తూ తల్లి జన్మపై మాట్లాడటం దుర్మార్గం. తల్లి ఎవరికైనా తల్లే.. అలాంటి మాటలు తప్పు.. మేమేవరం ఆయన యాత్రను అడ్డుకోవడం లేదు. బండి మాటలను మీరు సమర్థిస్తున్నారా అని నేను బీజేపీ అధ్యక్షుడిని అడుగుతున్న. కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఓటమి భయంతోనే బండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. హిందూ గాల్లు బొందుగాల్లు అని కేసీఆర్ అన్న మాటలను ఎలా రాజకీయంగా వాడుకున్నవో, ఇప్పుడు అమ్మ గురించి నువ్వు మాట్లాడిన మాటల్తో నీ రాజకీయ జీవితం అంతరించిపోవడం ఖాయం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.


బండి ఏమన్నారంటే...

‘‘అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావు. నన్ను అనవసరంగా గెలుకుతున్నారు, నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది. ఎక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసురుతున్న.. నేను నా విశ్వాసాలతో రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటా, నువ్వు నీ వాదనతో నీ అభ్యర్థిని నిలబెట్టు. నేను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వ్యాపారం చేసుకుని బతుకుతా, మళ్ళీ రాముడని, హిందూ మతమని మాట్లాడను. ఒకవేల నువ్వు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? పొన్నంతో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వారిలో పొన్నం ఉన్నారు. ఇలాంటి అలజడులలో రేవంత్‌ను ఇరికించి ఆయన పదవీ కిందకి నీళ్ళు తేవచ్చు. బీఆర్‌ఎస్‌లలో కేటీఆర్, కాంగ్రెస్‌లో పొన్నంలు మోపైండ్లు. కేటీఆర్ వాగుడుతో బీఆర్‌ఎస్ మునిగింది.. పొన్నంతో కాంగ్రెస్ మునగడం ఖాయం’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 12:05 PM