Share News

Jaggareddy: సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కోరాం

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:21 PM

ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ( Sonia Gandhi ) ని తెలంగాణలో పోటీ చేయాలని కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. సోమవారం నాడు MCRHRDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల ఎమ్మేల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వారిని పిలిచారని జగ్గారెడ్డి అన్నారు.

Jaggareddy: సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కోరాం

హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ( Sonia Gandhi ) ని తెలంగాణలో పోటీ చేయాలని కోరామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. సోమవారం నాడు MCRHRDలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల ఎమ్మేల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వారిని పిలిచారు. గతంలో ప్రజా పరిపాలన ఉండేది కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ప్రజా పాలన సాగుతోంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి మేలు కోసమే సద్వినియోగం చేస్తున్నాం. ఉమ్మడి మెదక్‌లో 10 నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 12 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలని.. 14 స్థానాలకు రీచ్ కావాలని టార్గెట్ పెట్టుకున్నాం. అభ్యర్థులకు సంబందించిన చర్చ జరగలేదు’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:21 PM