Share News

Niranjan Reddy: రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది

ABN , Publish Date - Jan 05 , 2024 | 08:42 PM

రైతులను రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రంజిత్‌రెడ్డిని మరో మారు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని తీర్మానం చేశామని చెప్పారు. ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ రైతు బంధుపై నోరు తెరవడం లేదని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Niranjan Reddy: రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది

మహబూబ్‌నగర్‌: రైతులను రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) మోసం చేసిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రంజిత్‌రెడ్డిని మరో మారు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని తీర్మానం చేశామని చెప్పారు. ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ రైతు బంధుపై నోరు తెరవడం లేదని ఎద్దేవా చేశారు. ఒక ఎకరా భూమి ఉన్న రైతులకు కూడా ఇప్పటి వరకు సంపూర్ణ రైతు బంధు ఇవ్వలేదన్నారు. ఒక్క ఎకరా లోపు రైతు బంధు ఇచ్చి ఎందుకు ఆపేశారని నిలదీశారు. ఇప్పటి వరకు ఎంతమందికి రైతు బంధు ఎంత ఇచ్చారో రోజు వారీగా లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతులకు రేవంత్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేధావుల నోర్లకు పక్షవాతం వచ్చిందా.. దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బోనస్, 15వేల రైతు భరోసా, రుణ మాఫీకి గతి లేదన్నారు. నిత్యావసరాల ధరలు గత 15రోజుల్లో విపరీతంగా పెరిగాయని చెప్పారు. పేదలకు ఇస్తానన్న సన్న బియ్యం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మీద ఎదురు దాడి కాదు, పాలన మీద దృష్టి పెట్టాలని నిరంజన్‌రెడ్డి హితవు పలికారు.

Updated Date - Jan 05 , 2024 | 08:42 PM