Share News

Lok Sabha Elections: సెంటిమెంటుకు అడ్డుకట్ట..

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:05 AM

లోక్‌సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో సెంటిమెంట్‌కు బ్రేక్‌ పడింది. ఒక పార్టీ ఒక స్థానం నుంచి వరుసగా రెండో, మూడోసారి నెగ్గదనే చర్చకు తెరపడింది. 1999 నుంచి సికింద్రాబాద్‌లో ఒకే పార్టీ వరుసగా మూడుసార్లు గెలవలేదు. 1999లో బీజేపీ, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాయి.

Lok Sabha Elections: సెంటిమెంటుకు అడ్డుకట్ట..

  • సికింద్రాబాద్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన బీజేపీ..!

  • మెదక్‌తో బీఆర్‌ఎస్‌ బంధం తెగడం తొలిసారి

హైదరాబాద్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో సెంటిమెంట్‌కు బ్రేక్‌ పడింది. ఒక పార్టీ ఒక స్థానం నుంచి వరుసగా రెండో, మూడోసారి నెగ్గదనే చర్చకు తెరపడింది. 1999 నుంచి సికింద్రాబాద్‌లో ఒకే పార్టీ వరుసగా మూడుసార్లు గెలవలేదు. 1999లో బీజేపీ, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాయి. 2014లో బీజేపీ తరపున బండారు దత్తాత్రేయ, 2019, ప్రస్తుత ఎన్నికల్లో కిషన్‌రెడ్డి గెలిచారు. సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలోనూ అదే పార్టీ అధికారంలో ఉంటుందనే విశ్వాసం బలంగా ఉంది. కాంగ్రెస్‌ నెగ్గిన 2004, 2009లో, బీజేపీ విజయం సాధించిన 2014, 2019లో ఇదే జరిగింది. మళ్లీ బీజేపీ గెలవడంతో.. కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తేలాల్సి ఉంది.

  • ఆదిలాబాద్‌ పార్లమెంట్‌లో చివరి నాలుగు ఎన్నికల్లో ఒకసారి నెగ్గిన పార్టీ మరోసారి జయకేతనం ఎగురవేయలేదు.కానీ, 2019, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.

  • మెదక్‌, మహబూబ్‌నగర్‌లో ఫలితాలు తారుమారయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 2009, 2014, 2019లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన బీఆర్‌ఎస్‌ ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది.

  • 2004 మొదలు 2019 వరకు అన్ని ఎన్నికల్లోనూ మెదక్‌లో గులాబీ జెండానే ఎగిరింది. ఈసారి అక్కడ బీజేపీ నెగ్గింది. 20 ఏళ్ల తరువాత బీఆర్‌ఎ్‌సకు మెదక్‌తో బంధం తెగిపోయిందనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 05 , 2024 | 06:05 AM