Share News

KTR: యాచన వద్దు.. శాసిద్దాం

ABN , Publish Date - May 05 , 2024 | 01:42 PM

‘రేపు కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చు.. ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో లేని బీఆర్‌ఎస్‌, బిజు జనతాదళ్‌, వైఎస్ఆర్‌సీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు.. దేశ రాజధానిని శాసించొచ్చు.. శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా ఆలోచించాలి’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) అన్నారు.

KTR: యాచన వద్దు.. శాసిద్దాం

- కూటమిలో లేని పార్టీలు ఢిల్లీని శాసించొచ్చు..

- కేంద్రంలో ఏమైనా జరగొచ్చు

- బీఆర్‌ఎస్ కు 10-12 సీట్లు ఇవ్వండి

- అమ్మలాంటి హైదరాబాద్‌ను కాపాడుకుందాం: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ: ‘రేపు కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చు.. ఎన్‌డీఏ, ఇండియా కూటమిలో లేని బీఆర్‌ఎస్‌, బిజు జనతాదళ్‌, వైఎస్ఆర్‌సీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు.. దేశ రాజధానిని శాసించొచ్చు.. శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా ఆలోచించాలి’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) అన్నారు. బీఆర్‌ఎస్‌ 10-12 సీట్లు గెలిస్తే మద్దతిచ్చే విషయంపై కాంగ్రెస్‌ హౌలాగాళ్లు ఏదేదో చెబుతున్నరు. మనకు బీజేపీ(BJP)తో పోయే ఖర్మ ఇప్పటి వరకు లేదు.. రేపు కూడా ఉండదు. గెలిచిన తర్వాత కూడా సెక్యులర్‌ పార్టీగా ఉంటం.. మతతత్వ పార్టీలతో కలవం అని అన్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy)కి మద్దతుగా ఆదివారం కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలోని షాపూర్‌ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, రాహుల్‌గాంధీ స్వయంగా ఉత్తరప్రదేశ్‌ను వదిలి కేరళకు వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. మనందరికి అన్నం పెట్టిన అమ్మలాంటి హైదరాబాద్‌ విశ్వనగరం కావాలనుకుంటే బీఆర్‌ఎస్‏కు ఓటేయండని కోరారు. మతం పేరిట పంచాయతీలు, కర్ఫ్యూలు, అల్లకల్లోలమైన విషనగరం కావాలనుకుంటే మీ ఇష్టం. మనందర్ని కడుపున పెట్టుకునే హైదరాబాద్‌ను కాపాడుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశ్యపూర్వకంగా ముస్లింలను అవమానిస్తున్నారని అన్నారు.

ఇదికూడా చదవండి: Charlapally Central Jail: ఈ జైలుకు పాతికేళ్లు..

పిచ్చోని చేతిలో రాయిలా..

రాష్ట్రంలో పాలన పిచ్చోని చేతిలో రాయిలా మారిందని, బూతులు మాట్లాడడం.. కేసీఆర్‌ను తిట్టడం పాలన కాదని రేవంత్‌రెడ్డి(Revanth Reddy)నుద్దేశించి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. యువతులకు స్కూటీలు ఇవ్వని కాంగ్రెస్‌ లూటీ ప్రారంభించిందని, పర్మిషన్లు ఇవ్వకుండా సతాయించి బిల్డర్ల దగ్గర గుంజుడు మొదలుపెట్టారని ఆరోపించారు. ఐదు నెలల్లో ఒక్క పరిశ్రమ తేకపోగా.. మనం కష్టపడి తెచ్చిన పరిశ్రమలూ ఇక్కడి నుంచి వెళ్తుంటే ఆపలేని అసమర్థత రేవంత్‌ది అని విమర్శించారు. ఐదు గ్యారంటీలు అమలు చేశామని, సిగ్గు లేకుండా రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నిండా హోర్డింగ్‌లు పెట్టుకున్నాడని విమర్శించారు. మల్కాజిగిరి ఎన్నికల్లో ఓడిపోతే ఒకరు తాండూరు.. ఇంకొకరు హుజురాబాద్‌కు పోతారని, ఇక్కడ ఉండే స్థానిక నాయకుడు లక్ష్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘కేసీఆర్‌ ఉన్నప్పుడు బాగుండే.. మళ్లీ ఆ రోజులు రావాలనుకునే వాళ్లంతా కారు గుర్తుకు ఓటేయాలి. 10-12 సీట్లు ఇస్తే.. ఆరు నెలల నుంచి యేడాదిలోపు కేసీఆర్‌ తిరిగి మీకు సేవ చేస్తాడు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Rahul Gandhi: నిర్మల్‌ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ....

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 01:42 PM