Share News

Chandrababu Birthday: ఖమ్మంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:05 AM

Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

Chandrababu Birthday: ఖమ్మంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
Chandrababu Naidu Birthday Celebrations

ఖమ్మం, ఏప్రిల్ 20: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) జన్మదిన వేడుకలు (Birthday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

AP Politics: అవినాశ్‌రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..


రామాలయంలో గోత్రనామాలతో చంద్రబాబు పేరిట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందజేశారు. 73 కేజీల కేక్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనుల ఫోటోలను వేసి మరీ.. టీడీపీ నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలుగు తమ్ముళ్లు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...

Bonda Uma: నాపై ఓ యుద్దానికి వచ్చినట్టు పోలీసులను పంపారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 11:09 AM