Share News

CM Revanth: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:25 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం నాడు రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు.

CM Revanth: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని (Badhrachalam Ramaiah Temple) దర్శించుకున్నారు. సోమవారం నాడు రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఉన్నారు.

Janasena: ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్


లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో...

అంతకుముందు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామిని దర్శించారు. యాదాద్రికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ సమర్పించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

Actress Aiswarya: రియల్‌ లైఫ్‌లో రూటు మార్చిన నటి.. రచ్చకెక్కిన భర్త!

PM Modi: మూడో సారి నేనే ప్రధాని.. మహిళలే ప్రాధాన్యతగా పథకాలు తెస్తామన్న మోదీ


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 01:53 PM