Share News

Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:21 PM

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.

Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు
Khammam Parliament congress Candidate

ఖమ్మం, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం పార్లమెంటు స్థానం (Khammam Parliament Seat) హాట్‌సీట్‌గా మారింది. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావాహులు పోటా పోటీగా నామినేషన్లు (Nominations) దాఖలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి తరుపున రెండు సెట్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోనేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి రాయల నాగేశ్వరరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే రేపు(ఏప్రిల్ 25) నామినేషన్‌ ప్రక్రియకు చివరి రోజు. ఈ క్రమంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి విషయంలో ఆ పార్టీ కార్యకర్తలో అయోమయస్థితి నెలకొంది.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి


తొలి నుంచి చర్చే...

కాగా.. తొలి నుంచి ఖమ్మం స్థానంపై చర్చ కాంగ్రెస్‌లో జరుగుతూనే ఉంది. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో తొలుత ఈ స్థానం నుంచి అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయించాలని భావించారు. అయితే సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజాగా ఖమ్మం ఎంపీ బరిలో ప్రియాంక గాంధీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఈ స్థానం కోసం ముగ్గురు మంత్రుల కుటుంబీకులు పోటీపడుతున్న విషయం తెలిసిందే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబం నుంచి తుమ్మల యుగంధర్ పోటీలో ఉన్నారు.

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్


రేణుకా చౌదరి సైతం...

మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా ఖమ్మం ఎంపీ స్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట ఖమ్మం ఎంపీ తనకే అని రేణుక భావించినప్పటికీ ఆమెను రాజ్యసభకు కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్‌సభకు పోటీ చేయమంటే చేస్తానంటూ రేణుక తన మనసులో మాట బయటపెట్టారు. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయమంటే రెడీగా ఉన్నట్లు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?.. బరిలో నిలబడే అభ్యర్థి ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు మరి. రేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో నేటి సాయంత్రం లేదా రేపటి లోగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Viral Video: షాప్‌లో చిక్కుకున్న కుక్క పిల్ల.. తల్లి కుక్క ఎంత విలవిలలాడిందో చూడండి.. ఎమోషనల్ వీడియో వైరల్!

AP Elections: తప్పుడు కేసులు పెట్టారనేందుకు నేనే ఉదాహరణ .. పోలీసులపై బోండా ఉమా ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 01:49 PM