Share News

Phone Tapping: రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు.. చిన్ననాటి మిత్రుడి కోసం...

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:07 AM

Telangana: తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారమే కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా అదే విషయం వినిపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Phone Tapping: రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు.. చిన్ననాటి మిత్రుడి కోసం...
Radhakishan rao Remand Report

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలో (Telangana) ఎక్కడ చూసినా ఫోన్‌ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారమే కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా అదే విషయం వినిపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు(Taskforce Former DCP Radha kishan Ra) రిమాండ్ రిపోర్టులో (Remand Report) కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధా కిషన్ వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు.

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!


తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎమ్మెల్సీకి పూర్తిస్థాయిలో రాధాకిషన్ సహాయం చేసినట్లు విచారణలో తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులను రవాణా చేసిన రాధా కిషన్... పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను ఎమ్మెల్సీకి అందజేసినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ జోన్‌ టాస్క్‌ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి డెలివరీ చేయించారని.. డబ్బుల వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డు ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

AP Elections: వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు... టీడీపీలోకి అధికారపార్టీ నేతల క్యూ...


వారిపై నిఘా కోసం ప్రత్యేక బృందం

బొలెరో వాహనంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరీ ఎమ్మెల్సీకి రాధా కిషన్ టీం అందజేసింది. డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కు రాధా కిషన్ చేరవేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై కూడా సదరు అధికారి నిఘా పెట్టారు. ప్రణీతరావు ఇచ్చే సమాచారంతో నిఘాను కట్టేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. రాధా కిషన్‌కు సహకరించిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లతో మాజీ పోలీసు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు.


ఇవి కూడా చదవండి...

Asaduddin Owaisi: ‘అసద్‌’ ప్రచారం ఆరంభం.. కార్యకర్తలతో కలిసి ఒవైసీ పాదయాత్ర

Hyderabad: అక్కడ.. రాజకీయ ప్రసంగాలు ఉండొద్దు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 10:35 AM