Share News

TS Politics: రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే ఆ రెండు కమిషన్లు

ABN , Publish Date - Mar 01 , 2024 | 07:11 PM

రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ రెండు కమిషన్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ప్రకటించనున్నది. శుక్రవారం నాడు పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

TS Politics: రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే ఆ రెండు కమిషన్లు

హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ రెండు కమిషన్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ప్రకటించనున్నది. శుక్రవారం నాడు పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధర్నా చౌక్‌ను తెరిచామని అన్నారు. ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రజా పాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించామన్నారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కుల, మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమని చెప్పారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామని అన్నారు. పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

రైతు భరోసాపై చర్చలు

గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు. అందరి సూచనలు , సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని వివరించారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయమని.. భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని అన్నారు. నిస్సహాయులకు, నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పినదానికంటే ఎక్కువ సహాయం చేయొచ్చని వివరించారు. ఆర్థిక, విద్యుత్, సాగునీటి రంగాలపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

Congress: దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ: వంశీచంద్ రెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి....

Updated Date - Mar 01 , 2024 | 08:09 PM