Share News

Congress: దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ: వంశీచంద్ రెడ్డి

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:09 PM

మహబూబ్ నగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణాజలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు.

Congress: దక్షిణ తెలంగాణపై  కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ: వంశీచంద్ రెడ్డి

మహబూబ్ నగర్: బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణాజలాలను (Krishna Water) ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని కాంగ్రెస్ (Congress) వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి (Vamsichand Reddy) విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ బేసిన్ నీటిని పెన్నా బేసిన్‌కు ఆంధ్ర నాయకులు తీసుకుపోతున్నా కేసీఆర్ అడ్డుపడలేదని ఆరోపించారు. మూడేళ్ళలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని, తొమ్మిదేళ్లయినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టు పొడవునా నాసిరకం పనులు జరుగుతున్నాయని, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని విమర్శించారు. కృష్ణా నదిలో తెలంగాణకు రావలసిన వాటాపై పోరాటం చేయలేదన్నారు. నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే 299 టీఎంసీలకు బదులుగా 577 టీఎంసీల వాటా వచ్చేదన్నారు. కేసీఆర్ డిజైన్ చేసిన కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (Medigadda)కుంగిపోయిందన్నారు. ఉత్తర తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి చేసి మేడిగడ్డను బొందల గడ్డగా మార్చారని, దక్షిణ తెలంగాణను మోసం చేశారని వంశీచంద్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - Mar 01 , 2024 | 01:39 PM