Share News

Phone Tapping: పోలీసుల దర్యాప్తు వేగవంతం.. ఎన్నిచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారంటే?

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:54 AM

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం అయ్యింది. నల్లగొండ, హైదరాబాద్‌లలో రెండు చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో చోట ట్యాపింగ్ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఖాకీలు కనుకొగన్నారు. నల్లగొండ విటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు.

Phone Tapping: పోలీసుల దర్యాప్తు వేగవంతం.. ఎన్నిచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారంటే?
Phone Tapping Case

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసుల దర్యాప్తు వేగవంతం అయ్యింది. నల్లగొండ, హైదరాబాద్‌లలో రెండు చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు (Telangana Police) గుర్తించారు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో చోట ట్యాపింగ్ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఖాకీలు కనుకొగన్నారు. నల్లగొండ విటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఖమ్మం జిల్లా కోసం నేలకొండపల్లి మామిడి తోటలోని గెస్ట్ హౌజ్‌లో ట్యాపింగ్ సెంటర్‌ను పెట్టారు.

LS Polls: బెంగాల్‌లో దోస్తీ, కేరళలో కుస్తీ.. ఇండియా కూటమిలో లుకలుకలు బీజేపీకి కలిసొస్తుందా!


హైదరాబాద్ ఎస్‌ఐబీ ఆఫీస్‌తో పాటు జూబ్లీహిల్స్‌లోనూ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వరంగల్, సిరిసిల్ల లో సైతం ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నేతల కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీస్ అదుపులో నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. అలాగే పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Money Management: 7 మనీ మేనేజ్‌మెంట్ టిప్స్.. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండిలా


మహిళలను కూడా వదల్లేదు...

మరోవైపు విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళలను కూడా పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించారు. ట్యాపింగ్‌లో ఓ కానిస్టేబుల్ నిర్వాకం అధికారుల విచారణతో వెలుగులోకి వచ్చింది. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత జీవితాలను కూడా సదరు కానిస్టేబుళ్లు టార్గెట్ చేశారట. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారట.


మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డాడు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సెటిల్‌మెంట్లు చేయడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ విపక్ష నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారు. ఆ తరువాత ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు వ్యవహారాన్ని సైతం తెలుసుకున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారానే అని పోలీసుల విచారణలో తేలింది. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారాన్ని ముందే తెలుసుకుని పోలీస్ ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్ర ద్వారా వ్యవహారం మొత్తం నడిపించారట. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన గుట్టంతా టాస్క్ ఫోర్స్ అధికారి రాధాకిషన్ రావు విప్పుతున్నారు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో తెలిపారు. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.


ఇవి కూడా చదవండి...

TS News: వామ్మో.. ఇదేం పైశాచికత్వం?

AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో చెప్పేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 08 , 2024 | 12:10 PM