Share News

Money Management: 7 మనీ మేనేజ్‌మెంట్ టిప్స్.. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండిలా

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:49 AM

డబ్బు, డబ్బు, డబ్బు(money) ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ దీని కోసమే పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఏది కొనాలన్నా, సినిమాకు వెళ్లాలన్నా, షికారు చేయాలన్నా కూడా మనీ కావాల్సిందే. అయితే అనేక మంది ఉద్యోగులకు వారికి వచ్చే నెల జీతం ఈజీగా ఖర్చయిపోతుంది. మంత్ ఎండ్ వచ్చే సరికి ఆర్థిక ఇబ్బందులు(financial problems) మొదలవుతాయి.

Money Management: 7 మనీ మేనేజ్‌మెంట్ టిప్స్.. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోండిలా
7 Money Management Tips

డబ్బు, డబ్బు, డబ్బు(money) ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ దీని కోసమే పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఏది కొనాలన్నా, సినిమాకు వెళ్లాలన్నా, షికారు చేయాలన్నా కూడా మనీ కావాల్సిందే. అయితే అనేక మంది ఉద్యోగులకు వారికి వచ్చే నెల జీతం సరిపోవడం లేదని చెబుతుంటారు. మంత్ ఎండ్ వచ్చే సరికి ఆర్థిక ఇబ్బందులు(financial problems) మొదలవుతాయి. మరికొంత మంది అయితే శాలరీ పెరిగినా కూడా ప్రతి నెల ఏమి మిగలడం లేదని అంటుంటారు. అలాంటి వారు కొన్ని మనీ మేనేజ్‌మెంట్(Money Management) టిప్స్(tips) పాటించడం ద్వారా ప్రతి నెల కొంత మేర పొదుపు చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎంత జీతం వచ్చినా కూడా ఆ మేరకు ఖర్చు చేస్తూ జీవించవచ్చని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.


మీ ఆదాయం, ఖర్చులు ఎంత?

మొదటగా మీకు ప్రతి నెల ఎంత ఆదాయం వస్తుంది, మీ నెలవారీ ఖర్చులను వ్రాయండి. అందులో అద్దె, ఈఎంఐ, కిరాణా సహా ఇతర ఖర్చులను చేర్చండి. అవన్నీ ఖర్చు చేయగా మీ దగ్గర ఎంత మనీ ఉంటుందో లెక్కించండి. మిగిలిన డబ్బులో కొంత సేవ్ చేసి, మరికొంత అత్యవసర ఖర్చుల కోసం పక్కన పెట్టండి.

ఆర్థిక లక్ష్యం

మీరు చేస్తున్న వృత్తి లేదా వ్యాపారాన్ని బట్టి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు బైక్ లేదా కార్, ఇళ్లు, టూర్, ఫారెన్ ప్లాన్ వంటివి ఏర్పరచుకుని వీటి కోసం ప్రతి నెల కచ్చితంగా కొంత మేర పొదుపు చేయండి.

ఖర్చుల తగ్గింపు

ఇప్పుడు మీరు మీ ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఖర్చులను తగ్గించుకుంటే మీ బడ్జెట్‌ మరింత సమర్థవంతంగా ఉంటుందో ఆలోచించండి. మీ ప్రధాన ఖర్చుల ప్రాధాన్యత ఆధారంగా వర్గాలను విభజించండి. ఆ క్రమంలో అనవసర ఖర్చులను తగ్గించి లక్ష్యాల కోసం మరింత ఆదా చేయండి. ఏదైనా షాపింగ్ వెళ్తే అవసరమైనవి మాత్రమే తీసుకోవాలనే కచ్చితమైన నియమాన్ని పాటించండి. మద్యం, టీ, కాఫీ, లాంటి ఇతర ఖర్చులను తగ్గించుకోండి.


అత్యవసర నిధి

జీవితం చాలా విచిత్ర మైనది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఊహించని ఖర్చుల కోసం ప్రతి నెల కొంత మొత్తాన్ని సేవ్ చేయండి. ఆ మొత్తాన్ని ఏదైనా అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు.

ఇన్సూరెన్స్ భద్రత

ప్రస్తుత కాలంలో కుటుంబ పెద్దకు ఇన్సూరెన్స్ భద్రత తప్పనిసరి అని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తికి ఏదైనా ఆకస్మాత్తుగా జరిగితే ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. అంతేకాదు ఏదైనా అనారోగ్యం బారిన పడినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ట్రిట్ మెంట్ చేయించుకుంటే ఆ ఖర్చులను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ రూల్ తప్పనిసరి

మీ నెలవారీ జీతాన్ని మూడు వేర్వేరు విభాగాలుగా విభజించి ఖర్చు చేయండి. వాటిలో ప్రధానంగా 50,30,20 రూల్ పాటించాలి. మీరు మీ నెలవారీ ఆదాయంలో 50% మీ ఇంటి ఖర్చులు, 30% మీ అవసరాలు సరదా, షాపింగ్ కోసం, మిగతా 20% పొదుపు కోసం కేటాయించండి. ఈ విధంగా మీరు ప్రతి నెల కూడా పాటించాలి.

క్రమం తప్పకుండా పాటించడం

మీ ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలు ఏర్పరచుకోవడం వేరు. వాటిని పాటించడం వేరు. కాబట్టి మీ మనీ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను క్రమం తప్పకుండా ప్రతి నెల సమీక్షించుకోండి. ఎక్కడ పొరపాటు చేస్తున్నాం. వేటిని సర్దుబాటు చేసుకోవాలనేది ఆలోచించి ప్లాన్ చేసుకోండి. ఒక నెల ఖర్చులు ఎక్కువైతే వాటిని వచ్చే నెలలో సర్ధుబాటు చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. అప్పుల జోలికి మాత్రం వెళ్లకండి. ఒకవేళ వెళ్లినా కూడా తక్కువ సమయంలో తీర్చే ప్రణాళిక చేసుకోండి.


ఇది కూడా చదవండి:

పునరుత్పాదక ఇంధనంపై రూ.2.30 లక్షల కోట్లు

ఎగుమతులపై మారుతి ఫోకస్‌


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 08 , 2024 | 11:53 AM