Share News

TS News: వామ్మో.. ఇదేం పైశాచికత్వం?

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:59 AM

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువు వద్ద తేజస్ సిద్దు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తేజస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఏడాది క్రితం దసరా పండగ రోజున ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో ఇతను ఏ3 నిందితుడు కావడం గమనార్హం.

TS News: వామ్మో.. ఇదేం పైశాచికత్వం?

హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువు వద్ద తేజస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తేజస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఏడాది క్రితం దసరా పండగ రోజున ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో ఇతను ఏ3 నిందితుడు కావడం గమనార్హం. అయితే తేజస్ హత్య కేసు దర్యాప్తును చేపట్టిన బాచుపల్లి పోలీసులకు సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో కనిపించింది. అది ఎవరిదో వీడియో కాదు.. తేజస్‌ను హత్య చేసిన వారి వీడియో. తేజస్‌ను హత్య చేసి నిందితులు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేశారు. నిందితుల్లో ఒకరు ప్రత్యర్థిని చంపి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తేజస్‌ని హత్య చేసినట్లుగా చూపెడుతూ నిందితులు డ్యాన్సులు చేస్తూ ఇన్‌స్టాలో నిందితులు పోస్ట్ పెట్టారు. తేజస్‌ని ఇద్దరు నిందితులూ వెంటాడి వేటాడి మరీ చంపేశారని సమాచారం.

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 10:59 AM