Share News

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:25 AM

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్నందున.. ముఖ్యంగా తన చిన్న కుమారుడుకి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. అయితే ‘‘కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నాడు. కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారు. అబ్బాయి చూసుకోవాడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయి. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు.

ట్యాపింగ్‌ తొలి బాధితుణ్ని నేనే

కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తునకు ఆటంకం...


‘‘కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత. కవిత మొబైల్ ఫోన్లను మార్చారు. ఆధారాలు ధ్వంసం చేశారు. ఫోన్లలో సమాచారాన్ని డిలీట్ చేశారు. 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపాం. 9 ఫోన్లను ఫార్మాట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. కవిత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు,కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వలేదు. ఫోరెన్సిక్ లాబ్ డేటా ప్రకారం 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయి. ఈ కేసులో వందల కొద్దీ డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ చేయబడింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది. లిక్కర్ వ్యాపారంలో కవిత వాటా 33 శాతం. మాగుంట రాఘవరెడ్డి వాటా 33 శాతం. దినేష్ అరోరా అప్రూవర్ మారాకా అన్ని విషయాలు చెప్పాడు. వంద కోట్ల రూపాయలు కవిత ఆలోచన మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటా రికవరీ చేశాము. ఆ డేటా ఆధారంగా కవితను విచారించాము. అరుణ్ పిళ్ళైతో కవితను విచారించాము. అప్రూవల్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారు’’ అని న్యాయవాది జోయబ్ హోస్సేన్ వెల్లడించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు. అలాగే కవితకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను తిరస్కరించాలని కోర్టును ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ కోరారు. ఈడీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం కవితకు బెయిల్‌ను నిరాకరించింది.

Harish Rao: పొద్దు తిరుగుడు పంటపై సీఎంకు హరీష్ లేఖ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 10:26 AM